గోపాలపురం నియోజకవర్గం భీమోలు గ్రామంలో పట్టాదారులకు న్యాయం చేయాలని సీపీఐ డిమాండ్ చేసింది. గోపాలపురంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పాల్గొన్నారు. ఈ నెల 12వ తేదీన భీమోలు గ్రామంలో దీనిపై పోరాటం సాగిస్తామన్నారు. ఆ రోజు జరగనున్న కార్యక్రమానికి పట్టాదారులకు సంఘీభావం తెలిపేందుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రానున్నారని తెలిపారు.