గోపాలపురం నియోజకవర్గ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడిగా గోపాలపురం మండలం, రాజంపాలెంకు చెందిన సీనియర్ వైసీపీ నేత కూరుకూరి నాగేశ్వరరావ్ నియమితులైయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జ్ తానేటి వనితా, వైఎస్ జగన్‌కు నాగేశ్వరరావు గురువారం కృతజ్ఞతలు తెలిపారు. తనకి అప్పగించిన ఈ బాధ్యతకు నిరంతరం శ్రమిస్తానన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు నాగేశ్వరరావుకు శుభాకాంక్షలు తెలిపారు.