గోపాలపురం: వాతావరణ మార్పులతో జాగ్రత్తలు తప్పనిసరి

73చూసినవారు
వాతావరణం మారుతున్న క్రమంలో జలుబు, జ్వరాల భారీన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సిహెచ్సి డాక్టర్ చైతన్యరాజు సూచించారు. గురువారం గోపాలపురం ప్రభుత్వాసుపత్రిలో ఆయన మాట్లాడుతూ వేడి ఆహారపదార్ధాలనే తినాలని, పరిసరాల్లో నీరు నిల్వ ఉంచుకోరాదన్నారు. మలమూత్ర విసర్జన అనంతరం సబ్బుతో చేతులు శుభ్రపరుచుకోవాలన్నారు. వైద్యుని సూచన మేరకే మందులు వాడుకోవాలన్నారు. హాస్పిటల్లో అన్ని వైద్య సదుపాయాలు ఉన్నాయన్నారు.

సంబంధిత పోస్ట్