గోపాలపురం మండలం దొండపూడి గ్రామంలో ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద కార్తీకమాసం సందర్భంగా ఆకాశ దీపం కార్యక్రమం బుధవారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొని ప్రత్యేక పూజలు అనంతరం ధ్వజ స్తంభం వద్ద ఆకాశదీపాన్ని వెలిగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.పాల్గొన్నారు