గండేపల్లి మండలం నీలాద్రిరావుపేటలో కూటమి నాయకుల సమావేశం బుధవారం సాయంత్రం జరిగింది. కూటమి తరఫున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ కు అందరూ ఓట్లు వేయాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కోరారు. పేరాబత్తుల గెలుపుకోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. జగ్గంపేట పరిధిలో ఆయనకు ఎక్కువ ఓట్లు పడేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల నవీన్, తుమ్మలపల్లి రమేశ్ పాల్గొన్నారు.