చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందినట్లు ఎస్ఐ శివనాగబాబు తెలిపారు. గండేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన కోడినాగుల శ్రీనివాస్(50) రోజూ మద్యం తాగుతుండడంతో భార్య మందలించింది. అప్పులు ఉండడం వంటి కారణాలతో జనవరి 1న గడ్డిమందు తాగాడు. కుటుంబసభ్యులు కాకినాడ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. దీనిపై భార్య దుర్గాదేవి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు.