కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ గేట్ వద్ద డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి వాహన తనిఖీల్లో ఇద్దరు కానిస్టేబుళ్లను ఢీకొట్టిన ఘటనకు సంబంధించి శుక్రవారం జగ్గంపేట సీఐ కార్యాలయం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ ఈ కారులో గంజాయి తరలిస్తున్నట్లు తెలియడంతో వెంటనే దాడి చేసి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి, 68. 6 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.