స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర సాధించే లక్ష్యతో ప్రజలందరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున వడగాల్పులు తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీవో చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ప్రతినెల మూడో శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో జగ్గంపేటలో పంచాయతీ అధికారి జి. శివ ఆధ్వర్యంలో నిర్వహించారు.