జగ్గంపేట: వైద్యం వికటించి బాలిక మృతి

68చూసినవారు
జగ్గంపేట: వైద్యం వికటించి బాలిక మృతి
జగ్గంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం వికటించి బాలిక మృతి చెందింది. వివరాల్లోకి వెళితే జగ్గంపేటకు చెందిన 8 ఏళ్ల బాలిక ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది వచ్చీరాని వైద్యం చేయడంతో రక్తం స్రావం అయిందని బంధువులు గురువారం తెలిపారు. మెరుగైన వైద్యం కోసం రాజమండ్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్