జగ్గంపేట మండలం గంగవరం మండలం రామదేవపురం గ్రామానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తిని శుక్రవారం బైక్ దొంగతనం కేసులో అరెస్టు చేశామని జగ్గంపేట ఎస్సై రఘునాథరావు మీడియాకు తెలిపారు. అతడి నుంచి ఐదు బైక్ లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అతనిపై కేసు నమోదు చేసి పెద్దాపురం కోర్టుకు హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు ఎస్ఐ రఘునాథరావు మీడియాకు వివరించారు.