జగ్గంపేట మండలం ఇర్రిపాకలో ఏలేరు నదీ తీరాన మల్లికార్జున స్వామి ఆలయం వద్ద ఫిబ్రవరి 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు శ్రీ శివ కేశవుల ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఈ పనులను గురువారం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. భక్తులంతా హాజరై శివకేశవులను దర్శించుకోవాలన్నారు.