జగ్గంపేటలోని శ్రీ అమృత ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ లో సోమవారం వసంత పంచమిని పురస్కరించుకుని స్కూల్ లో సరస్వతీ పూజలు మరియు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఉపాద్యాయులు పాల్గొని చిన్నారులతో పూజలు చేయించారు. పిల్లలు అందరూ కూడా సరస్వతీ దేవి కటాక్షం పొంది క్రమశిక్షణ తో మెలిగి చక్కగా విద్యను అభ్యసించాలి అని ఈ పూజ నిర్వహిస్తున్నాం అని స్కూల్ అధినేతలు తెలిపారు.