కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల లబ్ధి పొందాలంటే ప్రతి రైతు ఏపీ ఫార్మర్ రిజిస్ట్రీలో పేరు నమోదు చేసుకోవాలని వ్యవసాయ అధికారిణి జోకా అమృత తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆమె పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రతి రైతు ఆధార్ కార్డ్, బ్యాంకు ఖాతా పుస్తకం, పట్టాదారు పాస్ పుస్తకం నకలుతో పాటు మొబైల్ నంబర్ను రైతు సేవా కేంద్రానికి తీసుకొని వెళ్లాలని సూచించారు.