కిర్లంపూడి మండలం భూపాలపట్నం గ్రామం వద్ద ఏలేరు కాలువలో ప్రమాదవశాత్తు పడి వృద్ధుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. రామకృష్ణ (60) అనే వృద్ధుడు పనికి వెళ్లి వస్తుండగా కళ్ళు తిరిగి కాలువలో పడి అతను మృతి చెందాడు. మృతుడు భూపాలపట్నం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు.