రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలతో శనివారం జగ్గంపేటలో మద్యం తాగి వాహనాలను నడిపిన పలువురిని పట్టుకుని కోర్టులో హాజరుపరిచామని జగ్గంపేట సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఏడుగురికి రూ. 10 వేలు చొప్పున జరిమానా, ఐదుగురికి రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినందుకు మరో 13 మందికి రూ. 500 చొప్పున కోర్టు జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.