పేదల ఆకలి తీర్చేందుకుగాను కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని ఏర్పాటు చేసిన ఐదు అన్న క్యాంటీన్లను శుక్రవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభించనున్నట్టు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన గురువారం పేర్కొన్నారు. కాకినాడ నగరంలోని అన్నమ ఘాటీ సెంటర్, రమణయ్యపేట బోట్‌క్లబ్, సంత చెరువు, వివేకానంద పార్కు, డెయిరీ ఫారమ్ సెంటర్లలోని అన్న క్యాంటీన్లలో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అందుబాటులో ఉంటుందన్నారు.