ఈ నెల 15 నుంచి 28 తేదీ వరకు కాకినాడ క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో జరుగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ నిర్వహణ ఏర్పాట్లను మంగళవారం డీఎస్ఏ, జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, వివిధ కమిటీలకు సంబంధించిన జిల్లా స్థాయి అధికారులతో కలిసి పరిశీలించారు. వివిధ రాష్ట్రాల నుంచి రానున్న హాకీ క్రీడాకారులకు కల్పించుకున్న సౌకర్యాలు, వసతులను జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పరిశీలించారు.