జిల్లాలో అసంఘటిత రంగాల్లో పని చేస్తున్న కార్మికులను ప్రతీ ఒక్కరిని'ఈ-శ్రమ్' పోర్టల్ నందు మార్చి31లోగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాకినాడ కలెక్టరేట్ సమేవేశపు హాలులో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ , జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాతో కలిసి జిల్లాస్థాయి ఇంప్లిమెంటేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు.