కాకినాడ: అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి
By Gona Sureshkumar 51చూసినవారుప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో(పీజీ ఆర్ఎస్) అందిన వినతులను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కారించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాలులో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమాలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ట్రైనీ కలెక్టర్ హెచ్ఎస్. భావనా కలిసి హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.