పరిసరాల పరిశుభ్రత ప్రతీఒక్కరి జీవితంలో భాగం కావాలని జిల్లా డిఆర్ఓ జె. వెంకట్రావు కోరారు. స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛదివస్ కార్యక్రమంలో భాగంగా కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి జె. వెంకట్రావు మాట్లాడుతూ ఉష్ణ తాపం నుంచి ఉపశమనం కల్గించే లక్ష్యంతో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు..