రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని ట్రాఫిక్ సిఐ రమేష్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం కాకినాడ డ్రై ఫిష్ మార్కెట్" రోడ్ నందు నెంబర్ ప్లేట్స్ సరిగా లేని వాహనాలను సీజ్ చేశారు. హెల్మెట్ వాడకం పైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మోటార్ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ జారీ చేసిన నంబర్ ప్లేట్లను మాత్రమే వాడాలని సూచించారు.