రోడ్డు భద్రతపై అవగాహన అవసరమని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ భావన, ఆర్ టి ఓ శివరెడ్డి, డిసిసి కే శ్రీధర్ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ అంబేద్కర్ భవనంలో రోడ్డు వారోత్సవాలు సందర్భంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రయాణాల సమయంలో రోడ్డు భద్రతపై వాహనదారులు, ప్రజలుఅవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు.