భీష్ముడు ప్రహ్లాదుడు కన్నప్ప భగవంతుని పై అమితాసక్తి కలిగిన భక్తులుగా పరమాత్మ తత్వాన్ని గ్రహించిన దైవజ్ఞు లయ్యారని భోగిగణపతిపీఠం నిర్వాహకులు రమణ రాజు పేర్కొన్నారు. భీష్మఏకాదశిసందర్భం గా శనివారం కాకినాడ సూర్యారావుపేట దూసర్లపూడి వారి వీధిలోని స్వయంభూ పీఠంలో శ్రీవారి71వ జపయజ్ఞ పారాయణ జరిగింది. మహావిష్ణు విశ్వరూపాన్ని భక్తి ప్రపత్తులతో పూజించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.