ఇంటర్ విద్యార్థులకు అక్షయపాత్ర ద్వారా రుచికరమైన భోజనాన్ని అందించడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. శనివారం కాకినాడ పిఆర్ ప్రభుత్వ కళాశాల, పిఆర్ ప్రభుత్వ వృత్తి విద్య జూనియర్ కళాశాల లో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం జరిగిందన్నారు.