అధికారంలోకి వచ్చామని అలసత్వం వద్దని, ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేద్దామని తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ సూర్యకళ మందిరంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలు వేసి మినీ మహానాడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని వారు తెలిపారు.