చెరువులు, కాలువలు, డ్రెయిన్లు, వాగులు తదితర వాటర్ బాడీస్ ఆక్రమణలకు, ద్వంనికి గురికాకుండా కాపాడాలని కాకినాడ జేసీ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కోర్టు హాలులో వాటర్ బాడీస్ సంరక్షణపై జిల్లాస్థాయి వాచ్ డాగ్ కమిటీ తొలి సమావేశం జేసీ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆక్రమణలు, జలవనరులు అంతరించి దుష్పరిణామాలకు దారితీయకుండా నివారించేందుకు ఈ కమిటీలను ఏర్పాటు చేసిందన్నారు.