అత్యవసర, విపత్తుల వేళ క్షణాల వ్యవధిలో ప్రజలను ఏవిధంగా కాపాడాలన్నది స్పష్టంగా తెలిపేలా శుక్రవారం జిల్లా కేంద్రంలోని కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో మాక్‌డ్రిల్ నిర్వహించారు. ఏపీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ , పోలీసు శాఖల అధికారులు, సిబ్బంది సంయుక్తంగా పాల్గొని మాక్‌డ్రిల్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. రెవెన్యూ, వైద్య, ఆరోగ్యశాఖాధికారులు ఎలా సేవలు అందిస్తారో తెలియజేశారు.