కాకినాడ: ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి

64చూసినవారు
ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ పేర్కొన్నారు. శనివారం కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయం ఆవరణలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇంకుడు గుంతను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపును ప్రతీ ఒక్కరు సామాజిక బాధ్యతగా గుర్తించాలని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్