అంగన్వాడీల సమస్యలను పరిష్కరించడంలో గత పదేళ్ల నుండి కేంద్రంలోని మోడీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కల్పించుకొని పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ టీచర్, ఆయాలు 4వేల మంది లేఖలు పంపిస్తున్నట్లు ఏపీఅంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు, కార్యదర్శులు దడాల పద్మావతి పేర్కొన్నారు, మంగళవారం కాకినాడ సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆమె మాట్లాడారు.