కాకినాడ: గుంతలరహిత నగరంగా తీర్చిదిద్దాలి

60చూసినవారు
కాకినాడ: గుంతలరహిత నగరంగా తీర్చిదిద్దాలి
కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలోని రహదారుల్లో పడిన గుంతలను ఈనెల పదో తేదీలోపు పూడ్చి మరమ్మతులు చేపట్టాలని, నగరాన్ని గుంతల రహిత నగరంగా తీర్చిదిద్దాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ భావన ఇంజనీరింగ్‌ అధికారులకు సూచించారు. శుక్రవారం సాయంత్రం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్‌ ఎస్‌ఈ కామేశ్వరరావు, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

సంబంధిత పోస్ట్