మాదిగ జాతి అభ్యున్నతికి కృషి చేసిన శ్యామ్ బాబు మాదిగకు నివాళులు అర్పించేందుకు ఈనెల 19వ తేదీన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ కాకినాడ నగరానికి విచ్చేయనున్నారని ఎంఆర్పిఎస్, ఎంఎస్పి జాతీయ నాయకులు ముమ్మడివరపు చినసుబ్బారావు మాదిగ తెలిపారు. కాకినాడలో స్థానిక లేడీస్ క్లబ్ వద్దగల పార్కు ఆవరణలో ఆదివారం ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.