గత కొంతకాలంగా కేటుగాళ్లు డిజిటల్ అరెస్ట్ అంటూ కోట్ల రూపాయలు కాజేస్తున్నారు. కాకినాడకు చెందిన విశ్వనాథం అనే రిటైర్డ్ ఉద్యోగికి ఇలాగే డిజిటల్ అరెస్ట్ అని మెసేజ్ వచ్చింది. అప్పటికే ఆయనకు దీని గురించి తెలియడంతో కాకినాడ టూ టౌన్ సీఐను శనివారం కలిశారు. అతనికి వచ్చిన మెసేజ్ ను సీఐ అలాంటిది ఏమీ లేదని తేల్చిచెప్పారు. దీంతో తాను కోటి రూపాయలు నష్టపోకుండా పోలీసులు కాపాడారని విశ్వనాథం తెలిపారు.