ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'కు మద్దతుగా కాకినాడ టూ టౌన్ సెంటర్ నుండి భారీ జాతీయ జెండాతో శుక్రవారం సాయంత్రం ర్యాలీ నిర్వహించారు. టిడిపి పార్టీ కాకినాడ జిల్లా పార్లమెంటు అధ్యక్షులు నవీన్ కుమార్, ఎమ్మెల్సీ రాజశేఖర్, ఎమ్మెల్యే కొండబాబు తదితరులు 'సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారత సైన్యం దెబ్బకు పాకిస్తాన్ దేశం ఉక్కిరి బిక్కిరి అయిందన్నారు.