కాకినాడ రెవిన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్‌డీవో ఎస్. మల్లిబాబు అధ్వర్యంలో మంగళవారం సాయంత్రం వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూతో కలిసి సబ్ డిస్టిక్ లెవెల్ మల్టీ మెంబర్ అప్ర్పోప్రియెట్ అథారిటీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌డీవో మాట్లాడుతూ గర్భస్థ పిండ ఆరోగ్య పర్యవేక్షణకు సంబంధించిన పరీక్షలను లింగ నిర్ధారణకు దుర్వినియోగం కాకుండా అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లపై నిఘా పెట్టామన్నారు.