కాకినాడలో ఆదివారం రోడ్డుపై పర్సు పడి ఉండటం గమనించిన స్విగ్గి డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న ప్రకాష్ రెడ్డి పర్సును తీసి, నిజాయితీగా రోడ్డు ప్రక్కన ట్రాఫిక్ విధులలో ఉన్న ట్రాఫిక్ సిఐ రమేష్ కి అందజేసారు. సిఐ రమేష్ పర్సులో ఉన్న కరెంట్ బిల్ ఆధారంగా కురుకూరి జయ సారిక పర్సులో ఉన్న రూ.17వేలను అందజేశారు. అనంతరం సిఐ స్విగ్గి డెలివరీ బాయ్ ప్రకాష్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.