కాకినాడ: కూటమి ప్రభుత్వంలో పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం

78చూసినవారు
కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేసిందని కాకినాడ జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. కాకినాడలో బుధవారం వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం నుండి ఫీజు ఫోరుపై నిరసన కార్యక్రమం చేపట్టారు. మాజీ మంత్రి రాజా, మాజీ ఎంపీ వంగా గీత, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ అనంతబాబుతదితరులు ర్యాలీలో పాల్గొన్నారు.