రాష్ట్రంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం, భద్రత ప్రభుత్వ లక్ష్యమని, కార్మిక చట్టాలు పటిష్టంగా అమలు చేస్తామని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. శనివారం కాకినాడలో కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ లో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జరిగిన పరిశ్రమల్లో భద్రతపై అవగాహన కార్యక్రమంలో మంత్రి సుభాష్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో సుమారు 86 లక్షల మంది కార్మికులు వివిధ రంగాలలో పనిచేస్తున్నారన్నారు.