కాకినాడ సిటీ, రూరల్ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు), పంతం నానాజీ బుధవారం సాయంత్రం కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన ను మర్యాదపూర్వకంగా కలిసారు. ఇటీవలే కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఆమెను నగరపాలక సంస్థ కార్యాలయంలో పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురు ఎమ్మెల్యేలూ తమ నియోజకవర్గం పరిధిలోని పలు అభివృద్ధి అంశాలు, సమస్యలపై కమిషనర్ తో చర్చించారు.