విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల త్యాగాలు మరువలేనివని జిల్లా కలెక్టర్ షణ్మోసన్ సగిలి పేర్కొన్నారు. సోమవారం కాకినాడ పోలీస్ కార్యాలయంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోసన్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్, ఎమ్మెల్యే రాజప్ప ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ తదితరులు స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు.