సర్పవరం జంక్షన్ లో బోటు క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ వర్ధంతి గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉపాధ్యాయులు నిమ్మకాయల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భారత జాతీయోద్యమ పితామహుడిగా తిలక్ ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించారన్నారు. సామాన్యులను కూడా ఉద్యమంలో పాల్గొనేటట్లు చేశారన్నారు. శివాజీ ఉత్సవాలను, గణపతి నవరాత్రులను నిర్వహించారన్నారు.