ఊపిరితిత్తులలో క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందడం ప్రారంభమైనప్పుడు క్యాన్సర్ వస్తుందని దీనిని ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తే నివారించవచ్చని ఇండియన్ డెంటల్ అసోసియేషన్ పూర్వపు అధ్యక్షులు డాక్టర్ అడ్డాల సత్యనారాయణ పేర్కొన్నారు. సర్పవరం జంక్షన్ లో గురువారం బోటు క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన కార్యక్రమం నిర్వహించారు.