ఆధునిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత సమాజంలో మోసాలు కూడా అధికమవుతున్నందున అప్రమత్తంగా ఉండాలని సర్పవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. పెద్దిరాజు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ లోబోట్ క్లబ్ ఉద్యానవనంలో సోమవారం జరిగిన అవగాహన సదస్సు లో ఆయన మాట్లాడారు. సెల్ ఫోన్లలో అవతలి వ్యక్తి ఎవరో తెలియకుండా మాట్లాడటం తరువాత మోసాలకు గురి కావడం జరుగుతుందన్నారు. బ్యాంకు ఓటీడీలు, ఆన్లైన్ రుణాలు తదితర మోసాలు జరుగుతున్నాయన్నారు.