రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని కాకినాడ జేఎన్టీయూకే వీసీ, ఏంసెట్ చైర్మన్ సీఎస్. ఆర్. కె ప్రసాథ్. , కన్వీనర్ వివి సుబ్బారావు పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ జేఎన్టీయూకే సమావేశ మందిరంలో వారు విలేకరులతో మాట్లాడారు. సోమవారం 19 నుంచి 27వతేదీ వరకు ఎంసెట్ ను పూర్తి ఆన్లైన్ పద్ధతిలో జరిగే ఈ పరీక్షలకు పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు.