విద్యార్థులకు వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని కోరుతూ, ఈనెల 5న తలపెట్టిన ‘ఫీజు పోరు’ కార్యక్రమాన్ని మార్చి 12వ తేదీకి వాయిదా వేయడం జరిగిందని కాకినాడ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం మాజీ మంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద విలేకరులతోమాట్లాడారు. జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో పార్టీ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.