అన్నదమ్ముల పట్ల ఆడపడుచులకున్న అనురాగానికి ప్రతీకే రాఖీ పండగని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జీ. కృష్ణమోహన్ పేర్కొన్నారు. రమణయ్యపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం రాఖీ పండుగ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతమాత బిడ్డలు కులమతాలకతీతంగా స్నేహ బంధాన్ని సుస్థిరం చేసుకుందామన్నారు. ప్రతిఫలం ఆశించకుండా సోదరీ సోదరుల మధ్య విడదీయరాని బంధాన్ని రాఖీపూర్ణిమ పటిష్టం చేస్తుందని కృష్ణమోహన్ తెలిపారు.