ఆత్రేయపురం: వాడపల్లికి పోటెత్తిన భక్తజనం

67చూసినవారు
కార్తీక మాసం ప్రారంభం శనివారం రావడంతో ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో పోటెత్తింది. రాష్ట్రం నలుమూలల నుంచి స్వామివారి దర్శనార్థంభక్తులు తరలివచ్చారు. ఏడు శనివారాలు స్వామి వారిని దర్శించు కుంటే ఏడేడు జన్మల పుణ్య ఫలమని భక్తులు భావిస్తారు. కోనసీమ తిరుమల గా భావించే వాడపల్లి వెంకటేశ్వర స్వామిని భక్తులు తమ ఇలవేల్పుగా భావిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్