కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదివారం పర్యటన వివరాలు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఆదివారం ఉదయం 9 గంటలకు రావులపాలెం నూతనంగా ఏర్పాటు చేసిన ఏఎస్ఎల్ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు రావులపాలెంలో తిరంగ యాత్ర కార్యక్రమం నిర్వహిస్తారు. ఉదయం 11 గంటలకు కొత్తపేట బాబానగర్ లో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. కూటమి నాయకులు పాల్గొనాలని సూచించారు.