గోదావరి ఎగువ పరీవాహక ప్రాంతాలలో భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి వరదలు వచ్చే అవకాశంఉన్న దృష్ట్యా ప్రజలు గోదావరి చెంతకు వెళ్ళవద్దని ఆలమూరు తహసిల్దార్ అనిల్ కుమార్, ఎంపీడీవో మేరీరోజ్, అగ్రికల్చర్ ఏడి నాగేశ్వరరావు, ఆలమూరు ఎస్సై శ్రీనునాయక్ హెచ్చరించారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ, మూలస్థాన అగ్రహారం, బడుగువానిలంక వరద ప్రభావిత ప్రాంతాలను సోమవారం వారు పరిశీలించారు.