పెరవలి మండలం ఖండవల్లి గ్రామంలో జరుగుతున్న రీసర్వే పురోగతిని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, ఆర్డీవో రాణి సుస్మిత, జిల్లా సర్వే అధికారి బి. లక్ష్మి నారాయణతో కలిసి శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించే సర్వే బృందం జవాబుదారీతనం కలిగి ఉండాలని ఆదేశించారు. గ్రౌండ్ ట్రూటింగ్ ద్వారా భూముల సరిహద్దులను గుర్తించడం సులభతరం చేస్తుందన్నారు.