
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు గుడ్ న్యూస్!
APలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. 2 రోజుల్లో ఉత్తర్వులు జారీచేసే అవకాశముంది. జూన్ 16 వరకు HRMS పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించనున్నారని సమాచారం. జూన్ 22 నుంచి బదిలీ ప్రక్రియ ప్రారంభం కానుందట. మ్యూచువల్, స్పౌజ్, మెడికల్, దివ్యాంగులు, గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన వారు, కారుణ్య నియామకాలకుగానూ ప్రాధాన్యత ఇవ్వనున్నారు.